Tuesday, November 08, 2005

"A" tho modalayye saamethalu

ఆడ పిల్ల, సిగ్గు బిల్ల పలువురి లో కనిపించ రాదు.

//aada pilla, siggu billa paluvuri lo kanipincha raadhu.

ఆడబోయిన తీర్తము యెడురైనట్లు.

//aadaboayina theerthamu yedurainatlu.

ఆడడాని వయస్సు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు.

//aadadaani vayassu magavaani saMpaadhana adagodhdhannattu.


ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.

//aadalaeka madhdhela voadu annatlu.


ఆది లోనే హమ్స పాదు.

//aadhi loanae hamsa paadhu.

ఆది తప్ప రాదు, పలికి బొంక రాదు.
//aadhi thappa raadhu, paliki boMka raadhu.

ఆకాశానికి హదె లేదు.
//aakaashaaniki hadhe laedhu.


ఆకలి రుచి యెరుగదు, నిద్దుర సుఖము యెరుగదు, వలపు సిగ్గు యెరుగదు.
//aakali ruchi yerugadhu, nidhdhura sukhamu yerugadhu, valapu siggu yerugadhu.


ఆకలి వేస్తే రొకలి మింగమన్నాడట.
//aakali vaesthae rokali miMgamannaadata.


ఆకు యెగిరి ముల్లు మీద పడ్డ, ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే.
//aaku yegiri mullu meedha padda, mullu vachchi aaku meedha padinaa chirigaedhi aakae.

ఆలస్యం అమ్రుతం విశం.
//aalasyaM amruthaM vishaM.


ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సొమలిన్గం.
//aalu laedhu, choolu laedhu, koduku paeru somalingaM.


ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
//aarae dheepaaniki velugu yekkuva.


ఆరొగ్యమే మహాభాగ్యము.
//aarogyamae mahaabhaagyamu.


ఆస్తి మూరెడు ఆస బారెడు.
//aasthi mooredu aasa baaredu.


ఆత్రగానికి బుద్ది మట్టము.
//aathragaaniki budhdhi mattamu.


ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట.
//aavaliMthaku anna unnaadu kaani, thummuku thammudu laedaMta.ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు.
//aavalisthae paegulu lekka pettinatlu.


ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తున్దా?
//aavu chaenu maesthae, dhooda gattu maesthundhaa?


ఆయనే వుంటే మంగలి ఎందుకు? (పూర్వము బర్త చనిపోతె, ఆడవారు నెత్తిని కొరిగించుకునేవారు...అలా వచింది ఈ సామెత)
//aayanae vuMtae maMgali eMdhuku? (poorvamu bartha chanipoathe, aadavaaru neththini korigiMchukunaevaaru...alaa vachiMdhi ee saametha)


అబద్దము ఆడినా అతికినట్లు ఉండాలి.
//abadhdhamu aadinaa athikinatlu uMdaali.


అబ్యాసము కూసు విద్య.
//abyaasamu koosu vidhya.


అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడికి ఒక జంజపు పోగు.
//achchigaadi peLLiloa buchchigaadiki oka jaMjapu poagu.

అడగనిదే అమ్మైనా అన్నము పెట్టదు.
//adaganidhae ammainaa annamu pettadhu.

అడవారి మాటలకు అర్థాలే వెరులే.
//adavaari maatalaku arThaalae verulae.


అడవి కాచిన వెన్నెలలా.
//adavi kaachina vennelalaa.

అడవిలో పెల్లికి జంతువులే పురోహితులు.
//adaviloa pelliki jaMthuvulae puroahithulu.


అడ్డాలు నాడు బిడ్డలు కాని, గడ్డలు నాడు కాదు.
//addaalu naadu biddalu kaani, gaddalu naadu kaadhu.


అద్దం అబడ్దం చెప్పదు.
//adhdhaM abaddhaM cheppadhu.

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
//adigae vaadiki cheppaevaadu loakuva.


అదిగొ పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.
//adhigo puli aMtae idhigoa thoaka annattu.


అడుక్కునే వాడికి చెప్పులు కుట్టుకునే వాడు.
//adukkunae vaadiki cheppulu kuttukunae vaadu.


అడుక్కున్నమ్మకు అరవయ్యి కూరలట, వండుకున్న అమ్మకు ఒకటే కూరట.
//adukkunnammaku aravayyi kooralata, vaMdukunna ammaku okatae koorata.


అడుసు తొక్కనేల కాలు కడగనేల.
//adusu thokkanaela kaalu kadaganaela.


ఏ ఎండకు ఆ గొడుగు.
//ae eMdaku aa godugu.


ఏ గాలికి ఆ చాప.
//ae gaaliki aa chaapa.


ఏమి లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
//aemi laeni yedaariloa aamudhamu chettae mahaa vtRkShamu.

అగడ్తలో పడ్డ పిల్లికి అడ్డే వైకుంటము.
//agadthaloa padda pilliki addae vaikuMtamu.అగ్నికి ఆజ్యం పోసినట్లు.
//agniki aajyaM poasinatlu.


అగ్నికి వాయువు తోడైనట్లు.
//agniki vaayuvu thoadainatlu.


ఐశ్వర్యము వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
//aishvaryamu vasthae arTha raathri godugu pattamanaevaadu.


అక్క పెల్లి కుక్క చావుకి వచ్చిండి.
//akka pelli kukka chaavuki vachchiMdi.


ఆకులు నాక్కునే వాడి దగ్గర మూతులు నాక్కునే వాడట.
//aakulu naakkunae vaadi dhaggara moothulu naakkunae vaadata.


అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవలకి వెళ్ళి నోట్లో వెసుకున్నాడట.
//amaayakuniki akShiMthalu isthae aavalaki veLLi noatloa vesukunnaadata.


అంబలి నాకెటోడికి మీసాలెట్టెటొడు ఒకడు.
//aMbali naaketoadiki meesaalettetodu okadu.


అంభం లొ కుంభం లా.
//aMbhaM lo kuMbhaM laa.


అమ్మ కడుపు చూస్తుంది, పెల్లమ్ జెబు చూస్తుంది.
//amma kadupu choosthuMdhi, pellam jebu choosthuMdhi.


అందం అన్నం పెట్టదు.
//aMdhaM annaM pettadhu.


అన్దని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.
//andhani mraanipaMdlaku arrulu chaachuta.


అందుని మున్దు అందాలెల?
//aMdhuni mundhu aMdhaalela?


అందితె సిగ అందక పోతె కాల్లు.
//aMdhithe siga aMdhaka poathe kaallu.


అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో సెని
ఉన్నట్లు.
//aMgatloa annee unnaa, alludi noatloa seni unnatlu.


అన్న దానమ్ కన్టే విద్యా దానమ్ గొప్పది.
//anna dhaanam kantae vidhyaa dhaanam goppadhi.


అన్నం పరబ్రహ్మ స్వరూపం.
//annaM parabrahma svaroopaM.


అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి.
//annapraasana naadae aavakaaya pachchadi.అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
//annapu choravae gaani akSharapu chorava laedhu.


అన్నీ వున్న విస్తరాకు అనిగిమనిగి ఉందట. ఏమి లేని విస్టరాకు ఎగిరెగిరి పడ్డదట.
//annee vunna vistharaaku anigimanigi uMdhata. aemi laeni vistaraaku egiregiri paddadhata.


అన్ని డానములలో విద్యా డానం గొప్పది.
//anni daanamulaloa vidhyaa daanaM goppadhi.


అంతట బావె కాని వంగ తోటకాడ కాదు.
//aMthata baave kaani vaMga thoatakaada kaadhu.


అంత్య నిష్టూరం కన్నా ఆది నిశ్టూరం మేలు.
//aMthya niShtooraM kannaa aadhi nishtooraM maelu.


అనుమానం పెనుబూతం.
//anumaanaM penuboothaM.


అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు.
//appichchuvaadu vaidhyudu aMtaaru.


అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు.
//appu chaesi pappu koodu thinnattu.అర్దరాత్రి మద్డ్డెలదరువు.
//ardharaathri madhddeladharuvu.అసలే లేదంటె పెసరపప్పు వండమన్నాడట ఒకడు.
//asalae laedhaMte pesarapappu vaMdamannaadata okadu.


అసలు బాబు కన్నా, గుడ్డి బాబు మెలు అన్నట్టు.
//asalu baabu kannaa, guddi baabu melu annattu.అసలు కంటె వడ్డీ అంటె ప్రీతి అట.
//asalu kaMte vaddee aMte preethi ata.


అసలుకె ఎసరు పెట్టినట్లు.
//asaluke esaru pettinatlu.


అసమర్తుడికి అవకాసమివ్వనేల?
// asamarthudiki avakaasamivvanaela?


ఆసపఒతు బ్రాహ్మడు లెసిపొతూ పప్పు అడిగాడుట.
//aasapaothu braahmadu lesipothoo pappu adigaaduta.


అతి రహస్యం బట్ట బయలు.
//athi rahasyaM batta bayalu.


అట్త లేని కొడలుత్తమురాలు, కొడలు లేని అత్త గునవంతురాలు.
//attha laeni kodaluththamuraalu, kodalu laeni aththa gunavaMthuraalu.


అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.
//aththa meedha koapaM dhuththa meedha choopinatlu.


అత్త సొమ్ము అల్లుడు డానం.
//aththa sommu alludu daanaM.


అయిన వారికి అరిటాకుల్లో,కాని వారికి కన్చాలల్లో.
//ayina vaariki aritaakulloa,kaani vaariki kanchaalalloa.


అయితే ఆదివారము, కాకుంటె సొమవారము.
//ayithae aadhivaaramu, kaakuMte somavaaramu.


అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా?
//ayya vachchae varaku amaavaasya aaguthuMdhaa?


అయ్యకి లేక అడుక్కు తింటుంటే, కొడుకు వచ్చి కోడి పులావ్ అడిగాడట.
//ayyaki laeka adukku thiMtuMtae, koduku vachchi koadi pulaav adigaadata.


అయ్యవారిని చెయ్యబొతే కొతి అయినట్లు.
//ayyavaarini cheyyabothae kothi ayinatlu.


1 Comments:

At Tuesday, September 05, 2006 10:33:00 PM, Anonymous Anonymous said...

చాలా బాగున్నాయి .

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Google