Wednesday, November 09, 2005

"E" & "F" tho modalayye saamethalu

ఎద్దులాగా ఏడాది బ్రతికే కంటె, ఆంబొతులాగా ఆరు నెలలు బ్రతికితే చాలు.
//edhdhulaagaa aedaadhi brathikae kaMte, aaMbothulaagaa aaru nelalu brathikithae chaalu.


ఎదురుగా ఉన్నవాడె పెళ్ళికొడుకు అందిట.
//edhurugaa unnavaade peLLikoduku aMdhita.


ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమఒ, ఆ వూరు నుంచి ఈ ఊరు అంతే దూరమ్.
//ee ooruku aa ooru eMtha dhooramao, aa vooru nuMchi ee ooru aMthae dhooram.


ఈతకు మించిన లోతు లేదు.
//eethaku miMchina loathu laedhu.


ఎలుగు బంటి తొలు ఎన్నాళ్ళు ఉతికినా ,నలుపు నలుపేకాని తెలుపు రాదు.
//elugu baMti tholu ennaaLLu uthikinaa ,nalupu nalupaekaani thelupu raadhu.


ఎంగిలి చెతితొ కాకిని తోలడు.
//eMgili chethitho kaakini thoaladu.


ఎంత చెట్టుకి అంత గాలి.
//eMtha chettuki aMtha gaali.


ఎర్ర చీర కట్టున్నదల్లా నీ పెళ్ళామే?
//erra cheera kattunnadhallaa nee peLLaamae?


ఎవడి ముడ్డి కింద నీళ్ళు వొస్టె వాడికి టెలుస్టుండి బాద ఎమిటో.
//evadi muddi kiMdha neeLLu voste vaadiki telustuMdi baadha emitoa.


ఎవరు తీసుకున్న గొతిలో వారే పడతారు.
//evaru theesukunna gothiloa vaarae padathaaru.

2 Comments:

At Saturday, May 31, 2008 5:57:00 AM, Blogger Ramesh said...

Brother,
I have corrected mistakes in your saamethalu. I appreciate your work.

I will send remaining saamethalu in few days.

- Ramesh Kanuku
వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటే ఏమి?
వడ్ల గింజలో బియ్యపు గింజ.
వెన్నతో పెట్టిన విద్య.
వెర్రి వెయ్యి విదాలు.
వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నట్లు.
వినాశ కాలే విపరీత బుద్ది.
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు వేదాంతిట.
వినే వాడుంటె, అరవంలో హరికథ చెప్పాడట నీలంటివాడు.
విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతుంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
రాజుగారి దివానములో చాకలోడి పెత్తనము.
రాజు పెళ్లానికి ముష్టి రాత ఎవడు తప్పించగలడు?
రామాయణంలో పిడకల వేట.
రాత రాళ్ళ పాలైతే, మొగుడు ముండ పాలు అయ్యాడట.
రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు.
రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.
రాజును చూసిన కన్నులతో మొగుడ్ని చూస్తే చులకనలే.
రామాయణం అంతా విని సీత రాముడుకి ఎమౌతుంది అని అడిగాడంట.
రంకు మొగుడు, బొంకు పెళ్లాం.
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు.
రవి కాంచని చొటు కవి గాంచునట.
రెండు పడవల మీద కాళ్ళు ప్రయాణం
రోలు వచ్చి మద్దెలతొ మొర పెట్టుకుందిట.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుర్రము.
రుణ శేషం, శత్రు శేషం ఉంచరాదు.
ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది.
ఉపకారానికి పోతె అపకారమెదురైనట్లు.
ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్లు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానందట
తడి గుడ్డతొ గొంతు కోసినట్లు.
తాదూర కంత లేదు కానీ మెడకో డోలు.
తా చెడ్డ కోతి వనమెల్ల చెరచిందట.
తాడి తన్నువాని తల తన్ను వారు ఉండును.
తాలిబొట్టు బలమువల్ల తలంబ్రాల వరకు బతికాడు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
తాటాకు చప్పుళ్ళకు కుందేలు బెదురుతుందా?
తాతకు దగ్గులు నేర్పించుట.
తేలుకు పెతనమిస్తే తెల్లవార్లు కుట్టిందట.
తన కొపమే తన శత్రువు.
తన్ను మాలిన దర్మము మొదలు చెడ్డ బేరము.
తంతే బూరెల బుట్టలొ పడ్డట్లు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
తెగేదాక లాగవద్దు.
తేనె పూసిన కత్తి.
తిక్కలోడు తిరనాల్లకు వెలితే ఎక్క దిగ సరిపోయిందట.
తినే ముందు రుచి అడగటం ఎందుకు?
తినగ తినగ గారెలు చేదు.
తిండి కోసం బ్రతకకూడదు, బ్రతకడం కోసం తినాలి.
తిండికి తిమ్మరాజు, పనికి పొతురాజు.
తిక్క మొగుడితో తీర్థానికి వెలితే తీర్థం అని తిప్పి తిప్పి కొట్టాడట.
తిమ్మిని బమ్మిని చెయ్యడం.
తుమ్మితే ఊడిపొయే ముక్కు.
సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట.
సంసారం చెద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది.
సంగీతానికి చింతకాయలు రాలుతాయ?
సంకలో పిల్లొడిని ఉంచుకొని ఊరంా వెతికినట్టు.
సంతొషమే సగం బలం.
సర్వేంద్రియానాం నయనం ప్రదానం.
సత్రం భోజనం మఠం నిద్ర.
సీత కస్టాలు సీతవి, పీత కస్టాలు పీతవి.
సిగ్గు విడిస్తే శ్రీరంగమే.
సొమ్మొకడిది సోకొకడిది.
శుభం పలకరా పెళ్లికొడకా అంటే పెళ్లికూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట.
పాడిందె పాడరా పాచిపళ్ళ దాసరా.
పాకి దానితో సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు.
పానకంలో పుడక.
పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్లి మూర వేసిందట.
పాపి చిరాయువు.
పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది.
పదుగురాడు మాట పాడిఅయ్యి చెల్లు.
పక్కలో బల్లెం.
పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే - మంచం కొళ్ళలా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
పాండవులు సంపాదించిన రాజ్యం కౌరవుల తద్దినానికి సరిపోయిందట.
పండిత పుత్రః పరమ శుంఠః
పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగినట్టు.
పప్పులో కాలేసినట్టు.
పరాయి సొమ్ము పాము వంటిది.
పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
పట్ట పగలు కాకులు కావు కావు మంటుంటె మొగుడిని కౌగలించుకుందట.
పట్టిందల్లా బంగారమైనట్లు.
పట్టిపట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట.
పెదిమ దాటితే పెన్న దాటును.
పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభవమట.
పెళ్లి అంటే నూరేళ్ల పంట.
పెళ్లికి, శ్రార్దానికి కూడ ఒకటే మంత్రం చదివాడట.
పెళ్లికి వెలుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు.
పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.
పెరగుట తరగుట కొరకె.
పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
ఫలించే వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
పిలవని పేరంటానికి వెళ్లినట్లు.
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడట.
పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడు అన్నట్టు.
పిల్లి కి బిచ్చం వేయని పిసినారి.
పిల్లి సేపాలకు ఉట్లు తెగుతాయా?
పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం.
పిల్లికి ఎలుక సాక్ష్యం.
పిండి కొద్ది రొట్టె.
పిట్ట కొంచెం కూత ఘనము.
పోరు నష్టము పొందు లాభము.
పూస గుచ్చినట్టు చెప్పడం.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నడట.
పొరుగింటి పుల్ల కూర రుచి.
పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు.
పొట్టి వానికి పుట్టెడు బుద్దులు.
పోటుగాడు పందిరి వేస్తే పిచ్చికలు వచ్చి కూల దోసాయట.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
పుండు మీద కారం చల్లినట్లు.
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
ఒకడికి అద్రుష్టం కలిసి వచ్చి స్వర్గానికి వెళ్తే, రంభ ముట్లయి కూర్చుందిట.
ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే, మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పొయిందట.
ఊళ్లో పెల్లికి అందరూ పెద్దలే.
ఊళ్ళో పెళ్లికి కుక్కల హడవుడి.
ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
ఊరక రారు మహానుభావులు.
ఊరంతా చుట్టాలు, ఉట్టికట్ట తావు లేదు.
ఊరు మొహం గోడలు చెప్పుతాయి.
ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది.
ఊరుకున్నంత ఉతమం లేదు, బొడి గుండంత సుఖం లెదు.
ఒట్టు తీసి గట్టున పెట్టు.
నారు పొసిన వాడు నీరు పొయ్యడా?
నడుమంత్రపు సిరి, నరాల మీదపుండు ఆగనివ్వవట.

 
At Saturday, May 31, 2008 5:58:00 AM, Blogger Ramesh said...

I have used pothana 2000 font. If u can`t see my telugu text, please download pothana text.


-Regards,
Ramesh Kanuku

 

Post a Comment

<< Home

Google