Thursday, November 10, 2005

"M" tho modhalayye saamethalu

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు.
//maa thaathalu naethulu thaagaaru, maa moothulu vaasana choodaMdi annatlu.


మాటలు చూస్తె కొతలు దాటుతాయి.
//maatalu choosthe kothalu dhaatuthaayi.


మాటలు నెర్చిన కుక్క ఉస్కోమంటె కిస్కో ఉస్కో అందట.
//maatalu nerchina kukka uskoamaMte kiskoa uskoa aMdhata.


మంచమున్నంత వరకు కాల్లు చాచుకొ.
//maMchamunnaMtha varaku kaallu chaachuko.


మంచి వాడు, మంచి వాడు అంటె, మంచమెక్కి గంతులెసాడుట.
//maMchi vaadu, maMchi vaadu aMte, maMchamekki gaMthulesaaduta.


మంచికి పొతె చెడెదురైనట్లు.
//maMchiki pothe chededhurainatlu.


మంచిమాటకు మంది అంతా మనవాల్లే.
//maMchimaataku maMdhi aMthaa manavaallae.


మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయినట్లు.
//maMdhi ekkuva ayithae majjiga palachana ayinatlu.


మందుకి పంపితే మాసకానికి వచ్చాడట.
//maMdhuki paMpithae maasakaaniki vachchaadata.


మనిషి మర్మము, మాని చేవ బయటకు
తెలియవు.
//maniShi marmamu, maani chaeva bayataku theliyavu.


మనిషి పేద అయితే మాటకు పేదా?
//maniShi paedha ayithae maataku paedhaa?


మనిషికి మాటే అలంకారం.
//maniShiki maatae alaMkaaraM.


మనిషికొక మాట - గొడ్డుకొక దెబ్బ.
//maniShikoka maata - goddukoka dhebba.


మనిషికొక తెగులు మహిలొ వేమ అన్నారు.
//maniShikoka thegulu mahilo vaema annaaru.మనిషొకటి తలిస్తే, దేవుడొకటి తలిచాడట.
//maniShokati thalisthae, dhaevudokati thalichaadata.


మంత్రాలకు చింతకాయలు రాలవు.
//maMthraalaku chiMthakaayalu raalavu.


మంత్రాలు ఎక్కువ, తుంపర్లు తక్కువ.
//maMthraalu ekkuva, thuMparlu thakkuva.


మాటలు నెర్చిన కుక్క ఉస్కో అన్టే ఉస్కో అన్డిట.
//maatalu nerchina kukka uskoa antae uskoa andita.


మేక వన్నె పులి.
//maeka vanne puli.


మెరిసేదంతా బంగారం కాదు.
//merisaedhaMthaa baMgaaraM kaadhu.


మెత్తగా ఉంటే మొట్ట బుద్ది అయ్యిందట.
//meththagaa uMtae motta budhdhi ayyiMdhata.


మింగ మెతుకులెదు మీసాలకు సంపెంగ నూనె!
//miMga methukuledhu meesaalaku saMpeMga noone.


మొదటికే మోసం.
//modhatikae moasaM.


మొగుడ్ని తన్ని మొర పెట్టుకుండిట.
//mogudni thanni mora pettukuMdita.


మొగుడు కొట్టినందుకు కాదు, తొటికోడలు దెప్పినందుకు.
//mogudu kottinaMdhuku kaadhu, thotikoadalu dheppinaMdhuku.


మొహమటనికి పొతె కడుపు అయ్యిందట.
//mohamataniki pothe kadupu ayyiMdhata.


మొక్కై వంగనిదే మానై వంగునా?
//mokkai vaMganidhae maanai vaMgunaa?


మొండి వాడు రాజు కన్నా బలవంతుడ్.
//moMdi vaadu raaju kannaa balavaMthud.


మూల విగ్రహనికి లెక ముస్టి ఈతుకుంటుంటె, వుస్తవ విగ్రహలు వచ్చి వూరేగింపు ఎప్పుడు అన్నయట.
//moola vigrahaniki leka musti eethukuMtuMte, vusthava vigrahalu vachchi vooraegiMpu eppudu annayata.


మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.
//mooligae nakka meedha thaatikaaya paddatlu.


మూన్నాళ్ల ముచ్చట.
//moonnaaLla muchchata.


మొరటి వాడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడట.
//morati vaadiki mogali puvvu isthae madichi mudloa pettukunnaadata.


మొరిగే కుక్క కరవదు.
//morigae kukka karavadhu.


మోసేవానికి తెలుసు కావడి బరువు.
//moasaevaaniki thelusu kaavadi baruvu.


ముడ్డి మీద తంతే మూతి పల్లు రాలినట్టు.
//muddi meedha thaMthae moothi pallu raalinattu.


ముక్కట్టుకొమంటే బ్రాహ్మడి ముక్కు పట్టుకున్నాడట.
//mukkattukomaMtae braahmadi mukku pattukunnaadata.


ముక్కు మీద కొపం.
//mukku meedha kopaM.


ముక్కుకు సూటిగా పొవడం.
//mukkuku sootigaa povadaM.


ముల్ల కంప మీద పడిన గుడ్డలా.
//mulla kaMpa meedha padina guddalaa.


ముల్లును ముల్లుతొనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తొనే కొయ్యలి.
//mullunu mulluthonae theeyaali, vajraanni vajraM thonae koyyali.


ముండా కాదు, ముత్తైదువా కాదు.
//muMdaa kaadhu, muththaidhuvaa kaadhu.


ముందర కాల్లకి బందాలు వేసినట్లు.
//muMdhara kaallaki baMdhaalu vaesinatlu.


ముందు గొయ్యి - వెనుక నుయ్యి.
//muMdhu goyyi - venuka nuyyi.


ముందు వచ్చిన చెవుల కంటె, వెనకొచ్చిన కొమ్ములు వాడి.
//muMdhu vachchina chevula kaMte, venakochchina kommulu vaadi.


మున్దుంది ముసళ్ల పండగ.
//mundhuMdhi musaLla paMdaga.


ముంజేటి కనకనమ్మకు అద్దము ఎన్దుకు?
//muMjaeti kanakanammaku adhdhamu endhuku?


ముసలోడికి దసరా పండగన్నట్లు.
//musaloadiki dhasaraa paMdagannatlu.

0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Google