Tuesday, November 15, 2005

"P" tho modhalayye saamethalu

పాడిందె పాడరా పాచిపల్ల దాసరా.
//paadiMdhe paadaraa paachipalla dhaasaraa.


పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబుతఒ కలహం మేలు.
//paaki dhaanitho sarasam kaMtae aththaru saayibuthao kalahaM maelu.


పాము కాళ్లు పామునకెరుక.
//paamu kaaLlu paamunakeruka.


పానకములొ పుడక.
//paanakamulo pudaka.


పాపమని పాత చీర ఇస్తే గొడ చాటుకు వెళ్లి మూర వేసిందట.
//paapamani paatha cheera isthae goda chaatuku veLli moora vaesiMdhata.


పాపి చిరాయువు.
//paapi chiraayuvu.


పచ్చ కామెర్ల వచ్చిన వాడికి లొకం అంతా పచ్చగా కనపడుతుంది.
//pachcha kaamerla vachchina vaadiki lokaM aMthaa pachchagaa kanapaduthuMdhi.


పదుగురాడు మాట పాడిఅయ్యి చెల్లు.
//padhuguraadu maata paadiayyi chellu.


పక్కలో బల్లెం.
//pakkaloa balleM.


పన్చ పాన్డవులు ఎన్త మన్డి అని అడిగితే - మంచం కొల్లలా ముగ్గురు అని రెండు వెల్లు చూపించాడట.
//pancha paandavulu entha mandi ani adigithae - maMchaM kollalaa mugguru ani reMdu vellu choopiMchaadata.


పాండవులు సంపాదిన్చిన రాజ్యం కౌరవుల తద్దినానికి సరిపొయిందట.
//paaMdavulu saMpaadhinchina raajyaM kauravula thadhdhinaaniki saripoyiMdhata.


పండిత పుత్రః పరమ శుంటః.
//paMditha puthraH parama shuMtaH.


పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగినట్టు.
//panilaeni maMgaloadu pilli thala goriginattu.


పప్పులో కాలెసినట్టు.
//pappuloa kaalesinattu.


పరాయి సొమ్ము పాము వంటిది.
//paraayi sommu paamu vaMtidhi.


పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీల్లు తాగడం మేలు.
//parigeththi paalu thaagae kaMtae nilabadi neellu thaagadaM maelu.


పట్ట పగలు కాకులు కావు కావు మంటుంటె మొగుడిని కౌగలించుకుండట.
//patta pagalu kaakulu kaavu kaavu maMtuMte mogudini kaugaliMchukuMdata.


పట్టిందల్లా బంగారమైనట్లు.
//pattiMdhallaa baMgaaramainatlu.


పట్టిపట్టి పంగనామం పెడితే గొడ చాటుకు వెల్లి చెరిపి వేసుకున్నాడట.
//pattipatti paMganaamaM pedithae goda chaatuku velli cheripi vaesukunnaadata.


పెదిమ దాటితే పెన్న దాటును.
//pedhima dhaatithae penna dhaatunu.


పీనాసి వాడి పెల్లికి పచ్చడి మెతుకులు సంభవనట.
//peenaasi vaadi pelliki pachchadi methukulu saMbhavanata.


పెళ్లి అంటే నూరేళ్ల పంట.
//peLli aMtae nooraeLla paMta.


పెళ్లి, స్రార్దానికి కూడ ఒకటే మంట్రం చదివాడట.
//peLli, sraardhaaniki kooda okatae maMtraM chadhivaadata.


పెళ్లికి వెలుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్టు.
//peLliki veluthoo pillini chaMkana pettuku veLlinattu.


పెనం మీడ నుంచి పొయ్యిలో పడ్డట్టు.
//penaM meeda nuMchi poyyiloa paddattu.


పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.
//paenuku peththanamisthae thala aMthaa korikiMdhata.


పెరగుట తరగుట కొరకె.
//peraguta tharaguta korake.


పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
//perati chettu vaidhyaaniki paniki raadhu.


ఫలించె వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లు.
//phaliMche vtRkShaanikae raathi dhebbalu annatlu.


పిcచి కోతికి తేలు కుట్టినట్లు.
//picchi koathiki thaelu kuttinatlu.


పిచ్చోడి చేతులో రాయిలా.
//pichchoadi chaethuloa raayilaa.


పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము.
//pichchuka meedha brahmaasthramu.


పిలవని పేరంటానికి వెళ్లినట్లు.
//pilavani paeraMtaaniki veLlinatlu.


పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడట.
//pilichi pillanisthaanaMtae kulaM thakkuva annaadata.


పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడు అన్నట్టు.
//pilli gaddaaniki japaan blaedu annattu.


పిల్లి కి బిచ్చమ్ వేయడు పిసినారి.
//pilli ki bichcham vaeyadu pisinaari.


పిల్లి సేపాలకు ఉట్ట్లు తెగుతాయా?
//pilli saepaalaku uttlu theguthaayaa?


పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాన సంకటము.
//pilliki chelagaatamu, elukaku praana saMkatamu.


పిల్లికి ఎలుక సాక్ష్యం.
//pilliki eluka saakShyaM.


పిండి కొద్ది రొట్టె.
//piMdi kodhdhi rotte.


పిట్ట కొంచం కూత ఘనము.
//pitta koMchM kootha ghanamu.


పోరు నష్టము పొందు లాభము.
//poaru naShtamu poMdhu laabhamu.


పూస గుచ్చినట్టు చెప్పడం.
//poosa guchchinattu cheppadaM.


పోరాని చోట్లకు పొతే రారాని మాట్లు రాకపొవు.
//poaraani choatlaku pothae raaraani maatlu raakapovu.


పోర్లించి పోర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నడట.
//poarliMchi poarliMchi kottina meesaalaku mannu kaalaedhannadata.


పొరుగింటి పుల్ల కూర రుచి.
//porugiMti pulla koora ruchi.


పొట్ట కొస్తె అక్షరం ముక్క రాదు.
//potta kosthe akSharaM mukka raadhu.


పొట్టి వానికి పుట్టెడు బుద్దులు.
//potti vaaniki puttedu budhdhulu.


పోటుగాడు పండిరి వెస్తే పిచికలు వచ్చి కూల దొసాయట.
//poatugaadu paMdiri vesthae pichikalu vachchi koola dhosaayata.


పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.
//pulini choosi nakka vaatha pettukunnatlu.


పుండు మీద కారం చల్లినట్లు.
//puMdu meedha kaaraM challinatlu.


పున్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.
//punyaM kodhdhi puruShudu, dhaanaM kodhdhi biddalu.


పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది.
//puvvu puttagaanae parimalisthuMdhi.

0 Comments:

Post a Comment

<< Home

Google